Jansana flag stupa discovery in the village of Thandrapadu, Kurnool district

కర్నూల్ జిల్లా తాండ్రపాడు గ్రామంలో జనసేన జెండా స్థూపం ఆవిష్కరణ జరిగింది. స్థానిక జనసేన నాయకులు స్థూపం ఆవిష్కరించారు.

అనంతరం నిర్వహించిన సమావేశంలో జనసేన నాయకులు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వం స్థాపించేందుకు ప్రతి ఒక్కరు కష్టపడాలని పిలుపునిచ్చారు.

జనసేన సిద్ధాంతాలను మరియు మేనిఫెస్టో లో పొందుపరచిన అంశాలను ప్రజలకు వివరించి వారు జనసేన పార్టీ పట్ల ఆకర్షితులయ్యేలా చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క జనసైనికుడిది అని అన్నారు.

ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.