KV Vishnu Raju Garu Joins JanaSena Party

పశ్చిమ గోదావరి జిల్లాలో బీవీ రాజు అనే పేరు తెలియని వారు ఉండరు. ఆయన చేసిన సేవా కార్యక్రమాల ద్వారా భీమవరం పరిసర ప్రాంతంలో అనేక మంది లబ్ది పొందారు.

ఆయన వారసత్వాన్ని ఉనికి పుచ్చుకున్న ఆయన మనువడు ఆయన పేరు ప్రఖ్యాతలను మరింత మందికి తెలిసేలా చేశారు.

శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్ గా కొనసాగుతూ వేలాది మందికి నాణ్యమైన విద్యను అందజేయడంలో విష్ణు రాజు గారు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.

దేశంలోనే అగ్ర పారిశ్రామికవేత్తలలో ఒకరిగా కొనసాగుతూ పుట్టిన నేలను మరువకూడదు అనే బలమైన సంకల్పంతో భీమవరం పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇంతటి దృఢమైన చరిత్ర కలిగిన విష్ణు రాజు గారు జనసేన సిద్ధాంతాలు మరియు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి జనసేన పార్టీతో కలిసి నడవడానికి సిద్ధమయ్యారు.

హైదరాబాద్ లో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో విష్ణు రాజు గారు సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారితో పాటు నాదెండ్ల మనోహర్ గారు మరియు ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు.