Shri Pentapati Palla Rao is a member of the Janasana Party Political Affairs Committee

జనసేనలో చేరిన శ్రీ పుల్లారావు

ప్రముఖ ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకులు శ్రీ పెంటపాటి పుల్లారావుని జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులుగా నియమించినట్లు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు.

బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని కేంద్ర కార్యాలయంలో శ్రీ పుల్లారావు జనసేన పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ  పోల‌వ‌రం నిర్వాసితుల కోసం బ‌ల‌మైన పోరాటం చేసి, వారికి అండ‌గా నిల‌బ‌డ్డ ప్ర‌ముఖ రాజ‌కీయ విశ్లేష‌కులు, ఆర్థికవేత్త, పర్యావరణవేత్త శ్రీ పెంట‌పాటి పుల్లారావు గారిని మ‌న‌స్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్న‌ట్లు జ‌న‌సేన పార్టీ అధినేత శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు చెప్పారు.

విదేశాల్లో చ‌దువుకున్న పుల్లారావుగారు ఫారెస్ట్ జోన్ల ర‌క్ష‌ణ‌ కోసం చాలా పోరాడార‌ని తెలిపారు.

నా ఆహ్వానం మేర‌కు పార్టీలో జాయిన్ కావ‌డ‌మే కాకుండా పొలిటిక‌ల్ ఎఫైర్స్ క‌మిటీ స‌భ్యులుగా బాధ్య‌త‌లు స్పీక‌రించినందుకు మ‌న‌స్పూర్తిగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాన‌న్నారు.

పుల్లారావు గారి అనుభ‌వం, సూచ‌న‌లు, స‌ల‌హాలు జ‌న‌సేన పార్టీకి, జ‌న‌సైనికులకు దిశానిర్దేశం చేయ‌డంలో ఉప‌యోగ‌ప‌డాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

శ్రీ పుల్లారావు మాట్లాడుతూ “రాజ‌కీయాల్లో డ‌బ్బు ప్ర‌భావాన్ని రూపుమాపి,  తెలుగు ప్ర‌జ‌ల‌కు స‌రికొత్త రాజ‌కీయ విధానాన్ని ప‌రిచ‌యం చేయ‌డానికి జ‌న‌సేన పార్టీని శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు స్థాపించారు.

రాజ‌కీయాలు కొంద‌రికే ప‌రిమితం కారాద‌న్న ల‌క్ష్యంతో ప్ర‌జ‌ల‌ను రాజ‌కీయాల్లో భాగ‌స్వామ్యం చేయ‌డానికి ఆయ‌న ప‌డుతున్న త‌ప‌న న‌చ్చి జ‌న‌సేన పార్టీలో చేరాను.

భార‌త‌దేశంలో ఎన్నో రాజ‌కీయ పార్టీలు, ఎంద‌రో నాయ‌కులు ఉన్నారు..

అంతా ప‌ద‌వులు అనుభ‌వించారు త‌ప్ప, కొత్త ర‌క్తాన్ని రాజ‌కీయాల్లోకి తీసుకురావ‌డానికి మాత్రం ఎవ‌రూ కృషి చేయ‌లేదు. ఆ దిశ‌గా శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు అడుగులు వేయ‌డం ఆనందం క‌లిగించింది.

కోట్లాది మంది ప్ర‌జ‌లు అభిమానించే నాయ‌కుడు చాలా న‌మ్ర‌త‌గా న‌న్ను పార్టీకి ఆహ్వానించారు, ఆయ‌న పిలిచిన విధానం న‌చ్చి పార్టీకి సేవ‌లందించేందుకు సిద్ధ‌మ‌య్యాను.

జ‌నం పక్షాన నిల‌బ‌డాలి, జ‌న కోసం పోరాడాలని పుట్టిన‌ జ‌న‌సేన పార్టీకి అండ‌గా ఉంటా. నా అనుభ‌వాన్ని ఉప‌యోగించి పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తాను.

స‌మాజానికి మంచి చేయాల‌న్న త‌ప‌న ఉన్న వాళ్లు క‌చ్చితంగా జ‌న‌సేన పార్టీలో చేరాల‌”ని కోరారు.

* ప్రజా శ్రేయస్సు కాంక్షించే శ్రీ పవన్ కళ్యాణ్ గారి బాటలో నడుస్తా

* జనసేనలో చేరిన శ్రీ టి.రవికుమార్ మూర్తి (విశ్రాంత ఐ.పి.ఎస్.)

విరమణ అనేది ఉద్యోగానికి తప్ప ప్రజా సేవకు కాదు… నిరంతరం ప్రజా శ్రేయస్సును కాంక్షించే శ్రీ పవన్ కళ్యాణ్ గారు బాటలో నడిచేందుకు జనసేనలో చేరానని విశ్రాంత ఐ.పి.ఎస్. అధికారి శ్రీ తంబళ్లపల్లి రవికుమార్ మూర్తి చెప్పారు.

ఇటీవలే ఏలూరు రేంజి డి.ఐ.జి.గా పదవి విరమణ చేసిన శ్రీ రవికుమార్ మూర్తి, ఆయన సతీమణి శ్రీమతి రమాదేవి బుధవారం హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేనలో చేరారు.

వీరిద్దరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించి  పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు.

ఈ సందర్భంగా శ్రీ రవికుమార్ మూర్తి మాట్లాడుతూ “బలమైన సిద్దాంతాలతో పార్టీని నిర్మించి ప్రజా క్షేత్రంలోకి వచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి భావజాలం మమ్మల్ని ఆకట్టుకుంది.

విజన్ మేనిఫెస్టోలోని అంశాలు బడుగు, బలహీన వర్గాలు, పేదలకు ఎంతో మేలు చేసేలా ఉన్నాయి. ఐ.పీ.ఎస్. అధికారిగా ఎన్నో బాధ్యతలు చేపట్టాను.

ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు జనసేనలో చేరాను” అన్నారు.

శ్రీమతి రమాదేవి మాట్లాడుతూ “జనసేన పార్టీ ద్వారా బలమైన సామాజిక మార్పును ఈ సమాజం కోరుకొంటుంది..

శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదర్శవంతమైన నాయకత్వంలో నిరంతంరం పని చేస్తాం” అన్నారు.

జ‌న‌సేన పార్టీ అడ్వైజ‌రీ క‌మిటీ స‌భ్యుడిగా ప్రొ. ఎన్ సుధాక‌ర్‌రావు

రాష్ట్రంలో ప్ర‌త్యేక రాజ‌కీయ ప‌రిస్థితులు నెల‌కొన్న నేప‌ధ్యంలో ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కి అనుగుణంగా అడుగులు వేసేందుకు జ‌న‌సేన పార్టీ ముందుకి వ‌చ్చింద‌ని హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీ  ఎన్‌.సుధాక‌ర్‌రావు స్పష్టం చేశారు.

ప్ర‌జా శ్రేయ‌స్సుని ప‌ట్టించుకోకుండా పార్టీలు వారి వారి సొంత అజెండాల‌తో ముందుకి వెళ్తున్న త‌రుణంలో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల్ని ఏకం చేస్తూ శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు ముందుకి వెళ్తున్న తీరు అభినంద‌నీయ‌మ‌న్నారు.

అభ్యుద‌యం కోసం పాటు ప‌డే ఉద్దేశం ఉన్న పార్టీగా జ‌న‌సేన ముందుకి రావ‌డం ప‌ట్ల ఆయ‌న సంతృప్తి వ‌క్తం చేశారు.

బుధ‌వారం హైద‌రాబాద్‌లోని జ‌న‌సేన పార్టీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీ అధినేత శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారి ఆహ్వానం మేర‌కు పార్టీ అడ్వయిజ‌రీ క‌మిటీ స‌భ్యుడిగా శ్రీ ఎన్‌.సుధాక‌ర్‌రావు బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

అనంత‌రం మాట్లాడుతూ…

నాలుగు ద‌శాబ్దాల త‌న ప‌రిశోధ‌న‌లో అట్ట‌డుగు వ‌ర్గాలు, ద‌ళితుల‌కి ఇంకా ఎంతో న్యాయం జ‌ర‌గాల్సిన ప‌రిస్థితుల్ని గుర్తించాం.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఏ పార్టీ వీరి అభివృద్దిని ముందుకి తీసుకెళ్లే ప‌రిస్థితులు క‌న‌బ‌డ‌డం లేదు.

కులాల‌ని క‌లిపే ఆలోచ‌నా విధానంతో, స‌మ స‌మాజ స్థాప‌న‌కి శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు కంక‌ణం క‌ట్టుకున్నారు.

అలాంటి పార్టీలోకి మాలాంటి వారిని ఆహ్వానించ‌డం గొప్ప‌ విష‌యం.

పార్టీని న‌డిపించ‌డం, పాల‌సీల రూప‌క‌ల్ప‌న విష‌యాల్లో మా వంతు స‌హ‌కారం అందించ‌డం ద్వారా దేశాభివృద్దికి తోడ్పడాలన్న ల‌క్ష్యంతో అడ్వ‌యిజ‌రీ క‌మిటీలో స‌భ్యుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించానన్నారు.

శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు స‌మ‌స్య‌లని గుర్తిస్తున్న తీరు, వాటి ప‌రిష్కారానికి కృషి చేస్తున్న తీరుని ప్ర‌జ‌లంతా గుర్తించి జ‌న‌సేన పార్టీకి మ‌ద్ద‌తు తెల‌పాల‌ని ఆకాంక్షించారు.