JanaSana Party Advisory Council Members Sri V. Ponnuraj

మాజీ రాష్ట్ర‌ప‌తి డా. అబ్దుల్ క‌లాం గారికి సలహాదారుగా వ్యవహరించిన శ్రీ వి.పొన్నురాజ్ గారిని జ‌న‌సేన పార్టీ అడ్వైజ‌రీ కౌన్సిల్ సభ్యులుగా సేవలందించాలని కోరగా అందుకు అంగీకరించారని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు.

ఈరోజు ఉద‌యం  హైదరాబాద్ లోని కేంద్ర కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారితో శ్రీ పొన్నురాజ్ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ  “నా ఆహ్వానాన్ని మ‌న్నించి జ‌న‌సేన పార్టీ అ`డ్వైజరీ కౌన్సిల్ సభ్యులుగా శ్రీ పొన్నురాజ్ గారు బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉంది.

అబ్దుల్ కలాం గారికి సలహాదారుగా ఉంటూ దేశానికీ ఎంతో విలువైన సేవలు అందించారు.

వారి విలువైన స‌ల‌హాలు, సూచ‌న‌లు, వారి అనుభ‌వంఆర్ధికంగా వెనుకబ‌డిన బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల వారికి ఆర్ధిక పరిపుష్టినిచ్చేందుకుఉపయోగపడుతుంది.

అడ్వైజరీ కౌన్సిల్ ద్వారా పొన్ను రాజ్ గారు పంచే ఆలోచనలు సమాజ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడతాయి” అన్నారు.

శ్రీ పొన్నురాజ్ మాట్లాడుతూ “ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన దేశాల స‌ర‌స‌న నిల‌బెట్ట‌గ‌ల క్రియేటివ్ లీడ‌ర్ జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు.

రాష్ట్ర అభివృద్ధి ప‌ట్ల ఆయ‌న‌కు ఉన్న విజ‌న్ నాకెంతో ఆనందాన్నిచ్చింది. ఒక్క‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాత్ర‌మే కాదు యావ‌త్తు దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాల‌ని ఆయ‌న ఆకాంక్షిస్తున్నారు.

యువ‌త రాజ‌కీయాల్లోకి రావాల‌ని క‌లాంగారి అభిలాష‌ శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారిలోనూ ఉంది. ఆయ‌న రాజ‌కీయ ప్ర‌వేశం ఏపీలోనూ త‌ద్వారా భార‌త‌దేశ రాజ‌కీయాల్లో మంచి ఫ‌లితాలను ఇస్తుంద‌నే విశ్వాసం కలిగింది.

జనసేన అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడిగా సేవలు అందిస్తాను. సమ్మిళిత ఆర్థికాభివృద్ధి జరగాలి అంటే స్పష్టమైన సామాజిక దృక్పథం ఉండాలి.

ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలో ఉన్న వనరులు అభివృద్ధి చెందిన దేశంతో సమంగా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ గొప్ప అభివృద్ధి సాధించేందుకు అవసరమైన యువ నైపుణ్యాలు, వనరులు ఉన్నాయి.

అయితే వాటిని సద్వినియోగం చేసుకొని ఒక అభివృద్ధి చెందిన దేశంతో సమంగా ఎదిగాలి అంటే బలమైన నాయకుడు కావాలి.

ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవసరం”అన్నారు.

శ్రీ అబ్దుల్ కలాం బాటలో వెళ్తున్న శ్రీ పొన్నురాజ్ 

తమిళనాడుకు చెందిన శ్రీ వి.పొన్నురాజ్ రక్షణ రంగ శాస్త్రవేత్త. టెక్నాలజీ ఇంటర్ ఫేస్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు.

శ్రీ అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్న సమయంలో వారికి సాంకేతిక సలహాదారుగా వ్యవహరించారు.

రక్షణ రంగ శాస్త్రవేత్తగా ఉన్నప్పటి నుంచి వీరుకి శ్రీ కలాంతో నడిచారు. దాదాపు 20 సంవత్సరాలు శ్రీ కలాంతోపాటు అడుగులువేశారు.

యువతరం గురించి శ్రీ అబ్దుల్ కలాం ఆలోచనల సారాన్ని గ్రహించిన శ్రీ పొన్నురాజ్ వాటిని విద్యాలయాల్లో అమలు చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నారు.

యువ నాయకత్వం ద్వారా రాజకీయాలు ప్రక్షాళన జరుగుతుందని విశ్వసిస్తున్నారు. దేశాభివృద్ధికి మానవ వనరులను సద్వినియోగం చేసుకోవడం, యువతను మెరికల్లాంటి నిపుణులుగా తీర్చిదిద్దడంపై శ్రీ పొన్నురాజ్ పలు ఆలోచనలు చేస్తున్నారు.