Initially, the Committee on Narasapuram Lok Sabha constituency

జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్లమెంటరీ నియోజకవర్గం కమిటీల నియామకంలో భాగంగా  తొలుత నరసాపురం లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించి కమిటీని నియమించారు.

ఈ కమిటీకి రీజనల్ సెక్రటరీగా శ్రీ బొమ్మదేవర శ్రీధర్ (బన్ను), కార్యదర్శిగా శ్రీ యిర్రింకి సూర్యారావు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు గా శ్రీ కనకరాజు సూరి, శ్రీ యర్రా నవీన్,  వైస్ చైర్మన్ గా శ్రీ పోలిశెట్టి వాసు, కోశాధికారిగా శ్రీ పిళ్ళా నారాయణమూర్తి, అధికార ప్రతినిధులుగా శ్రీ చేగొండి సూర్యప్రకాశ రావు, శ్రీ పాదం మూర్తి నాయుడు, శ్రీ అనుకుల రమేష్ లను నియమించారు.

ఇంటలెక్చువల్ కౌన్సిల్ కి డా.చినమిల్లి శ్రీ కృష్ణ అప్పాజీ, లీగల్ విభాగానికి శ్రీ ఉండపల్లి రమేష్ నాయుడులను ఎంపిక చేశారు.

వీరితోపాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ, వర్కింగ్ కమిటీలకు కూడా సభ్యులను ఎంపిక చేశారు.

యువతను కలుపుకొంటూ శ్రీబొమ్మదేవర శ్రీధర్ సేవలు

భీమవరం పట్టణానికి చెందిన వ్యాపారవేత్త శ్రీ బొమ్మదేవర శ్రీధర్ (బన్ను)  యువతను కలుపుకొంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రీజనల్ సెక్రెటరీ గా నియమితులయ్యారు.

తోట్లవల్లూరు సంస్థానానికి చెందిన ఆయన ‘బన్ను యూత్’ ద్వారా పలు కార్యక్రమాలు చేపట్టారు.

పలు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా మంచి నీళ్లు అందిస్తూ, లెప్రసి కాలనీలో సదుపాయాలు కల్పిస్తున్నారు.

వ్యాపారాల్లో విజయాలు సాధించిన శ్రీ యిర్రింకి సూర్యారావు 

వ్యాపార రంగంలో పలు విజయాలు సాధించి వాణిజ్యవేత్తగా పలు అవార్డులు సాధించిన  శ్రీ యిర్రింకి సూర్యారావు కార్యదర్శిగా నియమితులయ్యారు.

పశ్చిమగోదావరి జిల్లా పార్టీ కో ఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ సిద్దాంతాలు, అధ్యక్షుల వారి భావజాలానికి విశ్వాసపాత్రుడైన నాయకుడీయన.

ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ‘దళిత సూరీడు’

నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం ఆర్గనైజింగ్ కార్యదర్సుల్లో ఒకరైన శ్రీ కనకరాజు సూరి ఆ ప్రాంతంలో ‘దళిత సూరి’గా జనసామాన్యంలో గుర్తింపు పొందారు.

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా శ్రీ సూరి గారి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు.

క్షత్రియ కుటుంబం నుంచి వచ్చిన శ్రీ సూరి విద్యార్థి దశ నుంచి పేద, బడుగు, బలహీన వర్గాలతో మమేకమయ్యారు. ఎస్సీ కులస్తులకు అండగా నిలిచి, వారి సంక్షేమానికి తపించారు.

ప్రజారాజ్యం పార్టీ తరఫున శ్రీ పవన్ కళ్యాణ్ గారు కేవలం ఇద్దరికి మాత్రమే అసెంబ్లీ టికెట్లు సిఫార్సు చేశారు. వారిలో శ్రీ కనకరాజు సూరి ఒకరు.

సామాజిక స్పృహతో, పేదలకు అండగా నిలిచే శ్రీ సూరికి నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం ఆర్గనైజింగ్ సెక్రటరీ బాధ్యతలు అప్పగించారు.

రాజకీయ నేపథ్యం నుంచి శ్రీ యర్రా నవీన్ 

తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన శ్రీ యర్రా నవీన్ ఉన్నత విద్యావంతులు. రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న శ్రీ నవీన్ తండ్రి శ్రీ యర్రా నారాయణ స్వామి గారు.

రాష్ట్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యులుగా నారాయణ స్వామి గారు అందించిన సేవలు పశ్చిమ గోదావరి జిల్లావాసులకు ఇప్పటికీ గుర్తే.

ఆ బాటలోనే శ్రీ నవీన్ వెళ్తూ పలు సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకొంటున్నారు.

జనసేన పార్టీలో చురుగ్గా ఉన్న వీరు జిల్లా జాయింట్ కో ఆర్డినేటర్ గా పనిచేశారు. శ్రీ నవీన్ కు ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నియమించారు.

ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు 

1 .కామన రామకృష్ణ

2 .దినేష్ యాదవ్

3 .మెరిపే దివ్యశ్రీ

4 . సుజాత నాయక్

5 . నేలేంద్ర రాజు

6 .నడపన శ్రీనివాసరావు (చంటి)

7 .సయ్యద్ ఖాజా మొహిద్దీన్

8 .ఉన్నమట్ల ప్రేమ్ కుమార్

9 .నవీన్ కుమార్

వర్కింగ్ కమిటీ సభ్యులు 

1 .చిట్టూరి శ్రీనివాస్

2 .జవ్వాది బాలాజీ శ్రీనివాస్

3 .అడ్డాల కనక దుర్గారావు

4 .షేక్ మహమ్మద్ అలీ

5 .పితాని వెంకటేష్

6 . వేగేశ్న గణేష్ చంద్ర వర్మ

7 . బొంతు శ్రీనివాస్

8 . పుప్పాల వీర వెంకట నరసింహారావు

9 .కొండ్రెడ్డి నారాయణ గిరీష్

10 .అటికెల ఆంజనేయ ప్రసాద్

11 .సి.హెచ్.చంద్ర శేఖర్

12 .చల్లా రాము

13 .వుడిసి మణికంఠ మీనాక్షి

14 .పుల్లా నరసింహరావు (బాబీ)

15 .మద్దాల మణి కుమార్

16 .యంత్రపాటి రాజు

17 .సజ్జా సుబ్రహ్మణ్యం (సుబ్బు)

18 .వలవల రవికుమార్

19 .కోటిపల్లి వీర వెంకటేశ్వర రావు

20 .కోపల్లి  శ్రీనివాస్

21 .యెన్నటి వెంకట లక్ష్మి

22 .నిమ్మకాయల సాయికుమార్

23 .తుమ్మగుంట్ల లక్ష్మణ రావు

24 .కూనపరెడ్డి

25 .దిలీప్ కుమార్ ఆరేటి

26 .రాంబాబు ఆదిమూలం

27 .నాగరాజు కొప్పిశెట్టి

28 .శ్రీనివాస్ కొమ్మిరెడ్డి

29. తులా రామలింగేశ్వర రావు