Sri Pusheshakar appointed to the Central Committee for Party Affairs (CCPA)

జనసేన పార్టీలోని కమిటీల నియామకంలో భాగంగా సెంట్రల్ కమిటీ ఫర్ పార్టీ అఫైర్స్ (సి.సి.పి.ఎ.)కు శ్రీ పులిశేఖర్ ని నియమించారు.

ఈ మేరకు ఉదయం హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు.

ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ప్రవాసాంధ్రులు శ్రీ శేఖర్ అమెరికాలో వందల కోట్ల విలువైన వ్యాపారాన్ని వదులుకొని పార్టీ కోసం పని చేసేందుకు నిబద్ధతతో వచ్చారు.

స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చిన ఆయనలో సామాజిక స్పృహ, పాలనలో పారదర్శకత ఉండాలనే తపన మెండుగా ఉన్నాయి.

డాలస్ లో ఆయన నన్ను కలిసి తన ఆలోచనలు పంచుకున్నారు.  పార్టీ నిర్వహణలో కీలకమైన సెంట్రల్ కమిటీ ఫర్ పార్టీ అఫైర్స్ కు చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తున్నాను” అన్నారు.

శ్రీపులి శేఖర్ మాట్లాడుతూ “సిద్దాంత బలంతో నిర్మితమైన పార్టీ జనసేన. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం, భావజాలం నన్నెంతో ఆకర్షించాయి.

ఈ రాష్ట్రం వారి నాయకత్వం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. వారు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తాను” అన్నారు.

వందల కోట్ల డాలర్ల సంపాదన కాదనుకొని వచ్చిన మేధావి 

‘ఆశాజ్యోతి’ సంస్థ ద్వారా ఏటా 5 వేల మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు అందిస్తున్న సాఫ్ట్ వేర్ సంస్థల నిర్వాహకులు శ్రీపులి శేఖర్ ఇప్పుడు జనసేన పార్టీ నిర్వహణ వ్యవహారాల బృందానికి చైర్మన్ బాధ్యతలు చేపడుతున్నారు.

అమెరికాలోని డాలస్ లో క్లౌడ్ మేనేజ్మెంట్ కు సంబంధించిన సంస్థకు అధిపతి ఆయన.

మచిలీపట్టణం నుంచి రెండు దశాబ్దాల కిందటే అమెరికా వెళ్లిన ఈ ఇంజినీర్ అక్కడ తన రంగంలో దూసుకువెళ్లారు.

శ్రీ శేఖర్ తాతగారు శ్రీ నాయుడు నాగేశ్వర రావు గారు స్వాతంత్ర పోరాటయోధులు. శ్రీ శేఖర్ భీమవరంలో ఇంజినీరింగ్ చదువు పూర్తి చేసుకొని అమెరికాలో ఎం.ఎస్. చదివారు.

ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థల్లో పనిచేశారు. అనంతరం ఎం.బి.ఎ.పూర్తి చేసి సొంతంగా కంపెనీ ప్రారంభించారు.

అది వందల కోట్ల విలువైన సంస్థగా ఎదిగింది. ఈ సంస్థను ఇటీవలే ప్రముఖ ఎం.ఎన్.సి. టేకోవర్ చేసింది.

ఒప్పందంలో భాగంగా శ్రీ శేఖర్ మరో రెండు సంవత్సరాలు ఆ సంస్థతో కలిసి ఉండాలి.

లేని పక్షంలో టేకోవర్ కు నిర్ణయించిన మొత్తంలో 25 శాతం వదులుకోవాలి.

జనసేన కోసం శ్రీ శేఖర్ ఆ 25 శాతం ఆదాయాన్ని త్యాగం చేశారు. విలువైన మేధో సంపద ఎందుకు భారత దేశం నుంచి విదేశాలకు వెళ్ళిపోతుంది?

ఇక్కడ ఎలాంటి పాలన విధానాలు అమలైతే విదేశాల నుంచి ఆ మేధో సంపదను తిరిగి మన దేశం పొందగలదు అనే శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన శ్రీపులి శేఖర్ని ఆకర్షించింది.

జనసేనకు ఉన్న బలమైన ఏడు సిద్దాంతాలు వారిని కదిలించాయి. పార్టీ నిర్వహణలో పాలుపంచుకునేందుకు తన సంస్థలను కూడా పక్కనపెట్టి మన రాష్ట్రానికి వచ్చేశారు.